Omicron variant: స్కాట్లాండ్‌లో ఆరుగురిలో ‘ఒమిక్రాన్‌’ గుర్తింపు

ఇటీవల దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్తరకం కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. డెల్టా రకం కన్నా అత్యంత ప్రమాదకరమైన.....

Published : 29 Nov 2021 16:03 IST

ఎడిన్‌బర్గ్‌‌: ఇటీవల దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్తరకం కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. డెల్టా రకం కన్నా అత్యంత ప్రమాదకరమైన ఈ వేరియంట్‌ దక్షిణాఫ్రికాతో పాటు బోట్స్‌వానా, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌, బ్రిటన్‌, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌లకు విస్తరించిన ఈ మహమ్మారి.. తాజాగా యూకేలో భాగమైన స్కాట్లాండ్‌ దేశంలో వెలుగు చూసినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే యూకే పరిధిలో ఒమిక్రాన్‌ కేసులు మూడు నమోదు కాగా.. తాజాగా స్కాట్లాండ్‌లో ఆరుగురిలో ఈ వేరియంట్‌ వెలుగుచూడటంతో.. యూకేలో మొత్తంగా ఈ కేసుల సంఖ్య 9కి పెరిగింది.

ఈ నేపథ్యంలో స్కాట్లాండ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంటాక్టు ట్రేసింగ్‌ చేపట్టాలని ప్రజారోగ్య విభాగం అధికారుల్ని ఆదేశించింది. ఈ కొత్త వేరియంట్‌ గురించి మరింత సమాచారం తెలిసేదాకా అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్కాట్లాండ్‌ ఆరోగ్యశాఖ కార్యదర్శి హమ్‌జా యూసఫ్‌ హెచ్చరించారు. ఈ వారాంతంలో బ్రిటన్‌లో మూడు కేసులు నమోదు కావడంతో ఇప్పటికే అప్రమత్తమైన బ్రిటిష్‌ ప్రభుత్వం.. తమ దేశంలోకి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించడం వంటి నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాపించిన దేశాలివే..
దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా,  కెనడా, యూరప్‌లోని నెదర్లాండ్స్‌, బెల్జియం, బ్రిటన్‌, స్కాట్లాండ్‌, డెన్మార్క్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, పోర్చుగల్‌తో పాటు ఇజ్రాయెల్‌; ఆసియా- పసిఫిక్ ప్రాంతంలోని హాంగ్‌కాంగ్‌, ఆస్ట్రేలియాలలో కొత్త వేరియంట్‌ కేసులు వెలుగుచూశాయి.  

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని