నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆయన ఓ సందేశాన్ని ప్రకటించారు.  ప్రేమ, కరుణ,  సహనాన్ని పంచుతూ సమసమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్న వారందరిని ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు...

Published : 31 Dec 2020 20:46 IST

దిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆయన ఓ సందేశాన్ని వినిపించారు. ప్రేమ, కరుణ, సహనాన్ని పంచుతూ సమసమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్న వారందరినీ ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రతి నూతన సంవత్సరం కొత్త అవకాశాలను కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ‘‘ కొవిడ్‌-19 వల్ల 2020 సంవత్సరం చాలా కష్టంగా గడిచింది. కరోనా మహమ్మారిని దూరం చేయడానికి మన మందరం కలిసి కట్టుగా ముందుకు సాగాలి. కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నా’’ అని రాష్ట్రపతి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని