Narendra Modi: ప్రపంచ ఉత్తమ నేతగా మోదీ నెంబర్‌.1

ప్రపంచ నేతల్లో భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ తనదైన సత్తా చాటుతున్నారు. ప్రపంచ నాయకుల్లో అత్యధికంగా 70 శాతం రేటింగ్‌తో ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్’ (Global Leader Approval Rating) జాబితాలో మోదీ అగ్రస్థానంలో నిలిచారు

Published : 07 Nov 2021 21:39 IST

70శాతం గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లో నరేంద్ర మోదీ తొలి ర్యాంక్

దిల్లీ: ప్రపంచ నేతల్లో భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ సత్తా చాటారు. ప్రపంచ నాయకుల్లో అత్యధికంగా 70 శాతం రేటింగ్‌తో ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్’ (Global Leader Approval Rating) జాబితాలో మోదీ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా పరిశోధనా సంస్థ ‘‘మార్నింగ్ కన్సల్ట్’’ (Morning Consult)  శనివారం విడుదల చేసిన జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్  ప్రధాని బోరిస్ జాన్సన్, ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వంటి ప్రపంచ నేతల కంటే మోదీ ముందున్నారు.

70 శాతం రేటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆమోదించిన ప్రపంచ నాయకుడిగా ప్రధాని మోదీ టాప్‌ 1 స్థానంలో ఉన్నట్లు జాబితా పేర్కొంది. మొత్తం 13 మంది అగ్రశ్రేణి ప్రపంచ నాయకులను దాటుకుని మోదీ తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ట్వీట్‌ చేశారు. ‘‘మోదీ జీ! దార్శనిక నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మోదీ ముందుండటం దేశానికే గర్వకారణం’’ అన్నారు.

రేటింగ్స్‌ స్థానాలు ఇలా..

1. భారత్‌ ప్రధాని- నరేంద్ర మోదీ - 70 శాతం
2. ఇటలీ ప్రధాని- మారియో డాగ్రి - 58 శాతం
3. జర్మనీ ఛాన్సలర్‌- ఏంజెలా మెర్కెల్‌ - 54 శాతం
4. ఆస్ట్రేలియా ప్రధాని- స్కాట్‌ మోరిసన్‌ - 47 శాతం
5. అమెరికా అధ్యక్షుడు- జో బైడెన్‌ -44 శాతం
6. కెనడా ప్రధాని- జస్టిన్‌ ట్రూడో -43 శాతం
7. బ్రిటన్‌ ప్రధాని- బోరిస్‌ జాన్సన్‌ - 40 శాతం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు