Published : 22/11/2021 15:12 IST

All party meeting: మోదీ అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం!

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 28న (ఆదివారం) అఖిలపక్ష పార్టీల సమావేశం జరగనున్నట్టు సమాచారం. ఈ నెల 29 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఉదయం 11గంటలకు అఖిలపక్ష పార్టీల సమావేశం జరగనుంది. అదే రోజు సాయంత్రం భాజపా పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్‌ సమావేశం నిర్వహించనున్నారు. అలాగే, ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షాల ఫ్లోర్‌లీడర్ల సమావేశం కూడా మధ్యాహ్నం 3గంటలకు జరగనున్నట్టు సమాచారం.ఈ సమావేశాలకు కూడా మోదీ హాజరు కానున్నట్టు తెలుస్తోంది. 

పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఈ నెల 29 నుంచి డిసెంబరు 23 వరకు నిర్వహించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. కొవిడ్‌ ప్రొటోకాల్‌ను పాటిస్తూ సమావేశాలు నిర్వహించాలని సూచించింది. కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో గతేడాది శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు. బడ్జెట్‌ సమావేశాలు, వర్షాకాల సమావేశాలనూ కుదించారు. ఈ దఫా పార్లమెంటు ఉభయ సభలు 20 రోజుల పాటు సమావేశం కానున్నాయి. కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌ సహా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

Read latest National - International News and Telugu News

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని