Updated : 30/10/2021 14:39 IST

Modi: వాటికన్‌ సిటీలో మోదీ.. పోప్‌ ఫ్రాన్సిస్‌ను కలిసిన ప్రధాని

వాటికన్‌ సిటీ: ఇటలీ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం వాటికన్‌ సిటీ చేరుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ ఉన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ మతగురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ను మోదీ కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు సమావేశమైన వీరు.. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, కొవిడ్‌ మహమ్మారి వంటి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రోమన్‌ క్యాథలిక్‌ హెడ్‌ను మోదీ ముఖాముఖిగా కలుసుకోవడం ఇదే తొలిసారి. పోప్‌ ఫ్రాన్సిస్‌తో దిగిన చిత్రాలను ప్రధాని మోదీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. పోప్‌ను భారత్‌కు ఆహ్వానించినట్లు తెలిపారు.

అయిదో భారత ప్రధాని మోదీనే..

వాటికన్‌ సిటీలో రోమన్‌ క్యాథలిక్‌ మత పెద్ద(పోప్‌)ను కలుస్తున్న ఐదో భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. అంతకుముందు మాజీ ప్రధానులు జవహార్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, ఐకే గుజ్రాల్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పోప్‌ను కలిశారు. 1955 జులైలో ఇటలీ పర్యటనకు వెళ్లిన నెహ్రూ.. వాటికన్‌ సిటీకి వెళ్లి అప్పటి పోప్‌ పియూస్‌ 12తో సమావేశమయ్యారు. ఆ తర్వాత 1981లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆమె వాటికన్ సిటీలో పర్యటించి పోప్‌ జాన్‌ పాల్‌ 2ను కలిశారు. 1997లో ఐకే గుజ్రాల్‌ కూడా ఇటలీ పర్యటన సందర్భంగా పోప్‌ జాన్‌ పాల్‌ 2తో భేటీ అయ్యారు. 2000 సంవత్సరంలో వాజ్‌పేయీ కూడా పోప్‌ జాన్‌ పాల్ ‌2తో సమావేశమయ్యారు.

ఐదు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా మోదీ శుక్రవారం ఇటలీ రాజధాని రోమ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే జి-20 సదస్సులో ఆయన పాల్గొననున్నారు. జి-20 సదస్సులో భాగంగా పలు దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షికంగా భేటీ కానున్నారు. ఇటలీ పర్యటన అనంతరం మోదీ.. కాప్‌-26 సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్‌ బయల్దేరి వెళతారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్