Covid Cases: కొవిడ్‌తో జర్మనీ విలవిల.. గరిష్ఠానికి ఇన్ఫెక్షన్ రేటు!
యూరప్‌లో కొవిడ్ మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జర్మనీలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీ సంఖ్యలో బాధితులతో ఇక్కడి ఆస్పత్రులు నిండిపోతున్నాయి. తాజాగా దేశంలో కొవిడ్ ఇన్ఫెక్షన్ రేటు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వారం వ్యవధిలో...
బెర్లిన్: యూరప్‌లో కొవిడ్ మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జర్మనీలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీ సంఖ్యలో బాధితులతో ఇక్కడి ఆస్పత్రులు నిండిపోతున్నాయి. తాజాగా దేశంలో కొవిడ్ ఇన్ఫెక్షన్ రేటు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వారం వ్యవధిలో ఈ రేటు లక్ష మందికిగానూ 277.4గా నమోదైంది. వైరస్ వ్యాప్తి మొదలైనప్పటినుంచి ఇదే అత్యధికం. జర్మన్ ప్రభుత్వ సంస్థ రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్(ఆర్‌కేఐ) ఈ గణాంకాలు వెల్లడించింది. గత వారమే ఈ రేటు 201.1గా ఉండగా, అతి తక్కువ సమయంలోనే 277కు చేరుకోవడం స్థానికంగా కొవిడ్ తీవ్రతకు అద్దం పడుతోంది! అంతకుముందు గతేడాది డిసెంబర్ 22న 197.6గా నమోదైంది. మరోవైపు రోజువారీ కేసులు మరోసారి 50 వేలు దాటాయి. 24 గంటల వ్యవధిలో 235 మంది మృతి చెందినట్లు ఆర్‌కేఐ వెల్లడించింది. సాక్సోని, తురింగియా, బవేరియాలో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది.
టీకా వేయించుకోవాలని మెర్కెల్ విజ్ఞప్తి
దేశంలో ఇన్ఫెక్షన్ రేటు భారీగా పెరగడంపై జర్మన్ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఇప్పటివరకు టీకాలు తీసుకోని వారు అత్యవసరంగా తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారిక వివరాల ప్రకారం.. జర్మనీలో 83 మిలియన్ల జనాభాలో 40 శాతం మందికి మాత్రమే రెండు డోసులు పూర్తయ్యాయి. ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాన్ సైతం దేశంలో మహమ్మారి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వైరస్ కట్టడి విషయమై మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని, వైద్యులకు ప్రోత్సాహకాలు అందిస్తామని, ఇండోర్ సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మరోవైపు.. దేశంలో కరోనా పరిస్థితులను నియంత్రించేందుకుగానూ ఫెడరల్ ప్రభుత్వం వచ్చేవారం స్థానిక 16 రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్‌కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్‌శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్‌కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్‌లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్‌పుర్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్‌కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్‌పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్‌కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్‌కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్‌లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్‌లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్‌రెడ్డి