Picasso: పికాసో చిత్రాలకు 110 మిలియన్‌ డాలర్లు..

ప్రముఖ చిత్రకారుడు పికాసో గీసిన చిత్రాలకు 110 మిలియన్‌ డాలర్ల ధర లభించింది. ఈ చిత్రం 20 ఏళ్లుగా ఓ హోటల్‌ గదిలో ఉన్నాయి. లాస్‌వేగాస్‌లోని బెల్లాజియో హోటల్‌లో సౌత్‌బే

Published : 24 Oct 2021 19:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ చిత్రకారుడు పికాసో గీసిన చిత్రాలకు 110 మిలియన్‌ డాలర్ల ధర లభించింది. ఈ చిత్రం 20 ఏళ్లుగా ఓ హోటల్‌ గదిలో ఉన్నాయి. లాస్‌వేగాస్‌లోని బెల్లాజియో హోటల్‌లో సౌత్‌బే ఆక్షన్‌ సంస్థ ఈ వేలం నిర్వహించింది. మొత్తం ఐదు చిత్రాలను ఈ వేలంలో విక్రయించారు. ఈ హోటల్లో మరో 12 పికాసో చిత్రాలు కూడా ఉన్నాయి. 

1938లో వేసిన ‘వుమెన్‌ ఇన్‌ ఏ రెడ్‌-ఆరెంజ్‌ ’చిత్రానికి 40.5 మిలియన్‌ డాలర్ల ధర పలికింది. వాస్తవానికి అంచనావేసినదాని కంటే 10 మిలియన్‌ డాలర్లు అదనపు ధర లభించింది.  మిగిలిన వాటిల్లో ఒక దానికి 24.4 మిలియన్‌ డాలర్లు, 9.5 మిలియన్‌ డాలర్లు, 2.1 మిలియన్‌ డాలర్లు చొప్పున ధర లభించింది. ఈ చిత్రాల కొనుగోలుదారుల పేర్లను మాత్రం ఆక్షన్‌ సంస్థ బహిర్గతం చేయలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని