పెగాసస్‌పై పెదవి విప్పిన కేంద్రం 

పార్లమెంటును కుదిపేస్తున్న పెగాసస్‌ నిఘా వ్యవహారంపై కేంద్రం మౌనం వీడింది. సైనిక శ్రేణి స్పైవేర్‌ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ గ్రూపుతో తాము...

Updated : 10 Aug 2021 05:29 IST

ఎన్‌ఎస్‌వో గ్రూపుతో లావాదేవీల్లేవు

రాజ్యసభలో రక్షణ శాఖ స్పష్టీకరణ

ఈనాడు, దిల్లీ: పార్లమెంటును కుదిపేస్తున్న పెగాసస్‌ నిఘా వ్యవహారంపై కేంద్రం మౌనం వీడింది. సైనిక శ్రేణి స్పైవేర్‌ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ గ్రూపుతో తాము ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని సోమవారం రాజ్యసభలో రక్షణశాఖ స్పష్టం చేసింది. ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ టెక్నాలజీస్‌తో రక్షణ శాఖకు ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా అని సీపీఎం సభ్యుడు వి.శివదాసన్‌ రాజ్యసభలో ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే వాటి వివరాలు చెప్పాలని అడిగారు. దానికి రక్షణశాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ లిఖితపూర్వక సమాధానమిస్తూ ఆ సంస్థతో ఎలాంటి లావాదేవీలు తాము జరపలేదని తేల్చిచెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్లో రక్షణ శాఖ వాటా 15.49% ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని