China Floods: చైనాలో భారీ వరదలు.. 17.5 లక్షల జనాభాపై ప్రభావం

ఒకవైపు తీవ్ర విద్యుత్‌ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న చైనాను మరోవైపు వరదలు ముంచెత్తుతున్నాయి! తాజాగా భారీ వర్షాలతో ఉత్తర చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌ అతలాకుతలం అవుతోంది. వరదల కారణంగా ఇప్పటికే స్థానికంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రావిన్స్‌వ్యాప్తంగా..

Published : 10 Oct 2021 22:14 IST

బీజింగ్‌: ఒకవైపు తీవ్ర విద్యుత్‌ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న చైనాను మరోవైపు వరదలు ముంచెత్తుతున్నాయి! తాజాగా భారీ వర్షాలతో ఉత్తర చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌ అతలాకుతలం అవుతోంది. వరదల కారణంగా ఇప్పటికే స్థానిక జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రావిన్స్‌వ్యాప్తంగా 76 నగరాలు, జిల్లాల్లోని దాదాపు 17.5 లక్షల జనాభాపై వరదల ప్రభావం పడినట్లు అత్యవసర నిర్వహణ విభాగం వెల్లడించింది. ఈ క్రమంలో దాదాపు 1.20 లక్షల మందిని వరద ప్రభావిత ప్రాంతాలనుంచి ఖాళీ చేయించి, సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు తెలిపింది.

మరోవైపు వర్షాల ధాటికి దాదాపు 1.90 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 17 వేలకు పైగా ఇళ్లు కూలిపోయాయి.  బాధితులకు తక్షణ ఉపశమనం కోసం అత్యవసర నిర్వహణ విభాగం దాదాపు 4 వేల టెంట్‌లు, 3,200 పడకలతోపాటు దుస్తులు, దుప్పట్లు సమకూర్చింది. ఇదిలా ఉండగా దేశంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాంతం ఇదే కావడం గమనార్హం. విద్యుత్‌ కొరతకు పరిష్కారంగా ఇటీవలే చైనా స్థానికంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే! ఈ మేరకు గనులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ.. వరదల ధాటికి ఇప్పటికే పెద్ద ఎత్తున బొగ్గు గనులు మూతబడినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు