Pigs in Airport: విమానాశ్రయంలో విధుల కోసం పందుల నియామకం

నెదర్లాండ్స్‌ రాజధానిలోని ఛిపోల్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుకోని సమస్య వేధిస్తోంది. అయితే ఆ సమస్యను ఎదుర్కొనేందుకు విమానాశ్రయ అధికారులు ఏకంగా......

Published : 17 Oct 2021 23:26 IST

ఆంస్టర్‌డ్యామ్‌: నెదర్లాండ్స్‌ రాజధానిలోని ఛిపోల్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుకోని సమస్య వేధిస్తోంది. అయితే ఆ సమస్యను ఎదుర్కొనేందుకు విమానాశ్రయ అధికారులు ఏకంగా పందులను నియమించుకున్నారు. యూరోప్‌ ఖండంలోనే మూడో అతి పెద్దదైన ఛిపోల్‌ విమానాశ్రయం దాదాపు 10.3 చదరపు మైళ్ల మేర విస్తరించి ఉంటుంది. ఈ విమానాశ్రయంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి పలు రకాల ధాన్యపు మొక్కలు మొలిచాయి. అవి ఏకంగా పంట పొలాల్లా దర్శనమిస్తున్నాయి. దీంతో వాటి గింజలను ఆరగించేందుకు రకరకాల పక్షులు అక్కడకు చేరుతుండటంతో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కొన్నిసార్లు రన్‌వేలపై గుంపులుగా వాలుతున్నాయి.

ఈ సమస్యతో విమానాశ్రయ అధికారులు తలలు పట్టుకున్నారు. ఈ సమస్య పరిష్కారానికి పలు మార్గాలను అన్వేషించి.. చివరకు పందులను నియమించాలని నిర్ణయించారు. పక్షులు రాకుండా, వచ్చిన వాటిని తరిమేసేందుకు తర్పీదు పొందిన 20 పందులను నియమించుకున్నారు. ఈ మంగళవారం నుంచి అవి విధుల్లోకి చేరనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. అవి 6 వారాలపాటు అక్కడ విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ పంటలను పందులే తినడం ద్వారా అక్కడ పంటలు మిగలవని.. దీంతో పక్షుల రాకకు అడ్డుకట్ట పడుతుందని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని