Omicron variant: యూరప్‌లో వచ్చే కేసులు సగానికిపైగా ఒమిక్రాన్‌వే!

యూరప్‌లో ఇకపై వెలుగు చూసే కొవిడ్‌ కేసుల్లో మెజారిటీ వాటా ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటాయని యూరోపియన్‌ యూనియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఏజెన్సీ ఈసీడీసీ వెల్లడించింది.

Published : 03 Dec 2021 23:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూరప్‌లో ఇకపై వెలుగు చూసే కొవిడ్‌ కేసుల్లో మెజారిటీ వాటా ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటాయని యూరోపియన్‌ యూనియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఏజెన్సీ ఈసీడీసీ వెల్లడించింది. ఈయూ/ఈఈఏ (యూరోపియన్‌ ఎకనమిక్‌ ఏరియా)లో సగానికి పైగా కేసులు ఇవే వెలుగు చూస్తాయని ఓ ప్రకటనలో పేర్కొంది. గణాంక పద్ధతిలో లెక్కించి ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపింది.

యూరప్‌లో ఇప్పటి వరకు 79 కేసులు వెలుగు చూడగా.. అందులో సగానికి పైగా కేసుల్లో ఎలాంటి వ్యాధి లక్షణాలూ కనిపించలేదని ఈసీడీసీ పేర్కొంది. మరో సగం మందిలో స్వల్పపాటి లక్షణాలు కనిపించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు తీవ్రమైన అనారోగ్యంగానీ, ఆస్పత్రుల్లో చేరికలుగానీ, మరణాలు గానీ సంభవించలేదని పేర్కొంది. డెల్టా వేరియంట్‌ కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఈ వేరియంట్‌ వల్ల తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఏవీ వెలుగు చూడలేదని ఈసీడీసీ పేర్కొంది. ఇప్పటి వరకు పూర్తిగా వ్యాక్సిన్‌ వేసుకోని వారు, 40 ఏళ్లు పైబడి బూస్టర్‌ డోసు తీసుకోని వాళ్లు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేసుకోవాలని ఈసీడీసీ డైరెక్టర్‌ ఆండ్రియా అమ్మోన్‌ ఓ ప్రకటనలో ప్రజలకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని