Parliament: ‘రైల్వే’ను ప్రైవేటుపరం చేయట్లేదు: రైల్వే మంత్రి

కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరణ చేస్తోందని చాలాకాలంగా వదంతులు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ లోక్‌సభలో స్పష్టతనిచ్చారు. రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన లేదని వెల్లడించారు. రైల్వే ప్రైవేటీకరణపై లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు

Published : 03 Dec 2021 23:42 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరణ చేస్తోందని చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ లోక్‌సభలో స్పష్టతనిచ్చారు. రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన లేదని వెల్లడించారు. రైల్వే ప్రైవేటీకరణపై లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

‘‘రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద లేదు. ప్యాసింజర్‌ రైళ్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులు ఇవ్వలేదు. కానీ, రైల్వేశాఖకు చెందిన భూములు, ఇతర ఆస్తులు.. స్టేషన్‌ అభివృద్ధి కార్యక్రమం కింద ప్రైవేటు వ్యక్తులకు లీజుగా బదిలీ ప్రక్రియ జరుగుతోంది. అదీ కూడా ఆమోదించిన పరిమిత కాలానికే. ఆ తర్వాత భూములు, ఆస్తుల్ని రైల్వేశాఖ తిరిగి వెనక్కి తీసుకుంటుంది. రైల్వేశాఖకు చెందిన ఆస్తులపై యాజమాన్య హక్కులు రైల్వేశాఖకే ఉంటాయి’’అని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు. 

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని