China: మన విద్యార్థులను డ్రాగన్‌ ఇంకా అనుమతించలేదు..

తమ దేశంలో చదువుకునే విదేశీ విద్యార్థుల విషయంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ASEAN(బ్రునె, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్‌, మలేషియా, మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం)దేశాలకు చెందిన ఒంటరి విద్యార్థులను చైనా వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. భారత్‌కు చెందిన విద్యార్థుల

Published : 24 Nov 2021 19:03 IST

దిల్లీ: తమ దేశంలో చదువుకునే విదేశీ విద్యార్థుల విషయంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ASEAN(బ్రునె, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్‌, మలేషియా, మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం)దేశాలకు చెందిన ఒంటరి విద్యార్థులను చైనా వచ్చేందుకు అనుమతించబోతున్నట్లు ప్రకటించింది. అయితే.. భారత్‌కు చెందిన విద్యార్థుల విషయంలో మాత్రం డ్రాగన్‌ దేశం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. 

చైనాలో కరోనా వైరస్‌ ప్రబలిన వెంటనే అక్కడ చదువుకుంటున్న వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు స్వదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదికిపైగా ఇంటికే పరిమితమైన విద్యార్థులు చదువును కొనసాగించడానికి తిరిగి చైనాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఆ దేశం మాత్రం విద్యార్థులకు అనుమతి నిరాకరిస్తూ వస్తోంది. తాజాగా ASEAN దేశాలకు అనుమతిచ్చి.. భారత విద్యార్థులకు మొండిచేయి చూపింది. గతేడాది నుంచే భారతీయులకు వీసాలు మంజూరు చేయడం నిలిపివేసింది. ఇరు దేశాల మధ్య విమానాసేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో 23వేల మంది విద్యార్థులు(వారిలో ఎక్కువగా మెడిసిన్‌ చదువుకునే విద్యార్థులే), వందల మంది వ్యాపారవేత్తలు చైనాకు తిరిగి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖ అధికారులు స్పందిస్తూ.. విదేశీ విద్యార్థులను అనుమతించే అంశానికి చైనా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. విద్యార్థులను దేశంలోకి అనుమతించే విషయంలో కరోనా భద్రత ప్రమాణాలు పాటిస్తుందని, సమన్వయ పద్ధతిలో అనుమతులకు ఏర్పాట్లు చేస్తోందని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు