Published : 13/07/2021 22:16 IST

Nepal: ప్రధానిగా ప్రమాణం చేయను: దేవ్‌ బా !

కాఠ్‌మాండూ: ప్రధానిగా నియమితులైన నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహుదూర్ దేవ్‌బా (74) ప్రమాణస్వీకారం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. రాష్ట్రపతి బిద్యాదేవి భండారీ జారీ చేసిన నియామక పత్రంలో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ కింద తనను ప్రధానిగా నియమించారో వెల్లడించలేదని ఆయన అన్నట్లు తెలిసింది. నియామక పత్రంలో మార్పులు చేస్తేనే ప్రమాణస్వీకారానికి అంగీకరిస్తానని చెప్పినట్లు సమాచారం. ఐదోసారి నేపాల్‌ ప్రధానిగా నియమితులైన షేర్‌ బహుదూర్‌ దేవ్‌ బా బుధవారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 76(5) ప్రకారం ప్రధానిని నియమిస్తూ నేపాల్‌ రాష్ట్రపతి బిద్యాదేవి భండారీ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 30 రోజుల్లో దేవ్‌బా పార్లమెంట్‌లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దేవ్‌బా గతంలో నాలుగుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేవ్‌బాను ప్రధానమంత్రిగా నియమించాలని ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రపతి బిద్యా దేవి భండారీని సోమవారమే ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి చోలేంద్ర షంషేర్‌ రాణా ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని కేపీ శర్మ ఓలి సిఫార్సు మేరకు ప్రతినిధుల సభను అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. జులై 18న ప్రతినిధుల సభ సమావేశాన్ని జరపాలని సూచించింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని