పశువుల పాకే వేదిక.. ఆవులే శ్రోతలు!

కొవిడ్‌ మహమ్మారి అన్ని రంగాలపై చూపినట్లుగానే సంగీత కళాకారులపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. సినిమాలు, డిజిటల్‌ కంటెంట్లు ఉన్నా.. సంగీత కళాకారులు నిర్వహించే కచేరీలకు ఆదరణ బాగానే ఉండేది. కానీ, కరోనా కారణంగా ప్రజలు గుంపులుగా చేరకూడదని అనేక దేశాలు నిబంధనలు

Published : 04 Jul 2021 23:04 IST


(Photo : Scandinavian Cello School  Facebook)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ మహమ్మారి అన్ని రంగాలపై చూపినట్లుగానే సంగీత కళాకారులపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. సినిమాలు, డిజిటల్‌ కంటెంట్లు ఉన్నా.. సంగీత కళాకారులు నిర్వహించే కచేరీలకు ఆదరణ బాగానే ఉండేది. కానీ, కరోనా కారణంగా ప్రజలు గుంపులుగా చేరకూడదని అనేక దేశాలు నిబంధనలు విధించాయి. దీంతో వేదికలు మూతపడ్డాయి. కచేరీలు లేక కళాకారులు ఖాళీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సంగీతకళాకారుడు ఆవులకు సంగీతం వినిపించేందుకు పశువుల పాకల్లో సంగీత కచేరీలు నిర్వహిస్తున్నాడు.

బార్సిలోనాలోని మార్షల్‌ అకాడమీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు జాకబ్‌ షా. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌కు సమీపంలోని స్టీవెన్స్‌ పట్టణంలో 2016లో శాండినావియన్‌ సెల్లో పేరుతో వయోలిన్‌ మ్యూజిక్‌ స్కూల్‌ను ఏర్పాటు చేశాడు. అయితే, ప్రస్తుతం కరోనా కారణంగా కచేరీల ఊసే లేకుండా పోయింది. దీంతో తన తోటి సంగీత కళాకారులు, విద్యార్థులతో కలిసి స్టీవెన్స్‌ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పశువుల పాకల వద్ద సంగీత కచేరీలు పెట్టడం ప్రారంభించాడు. సంగీతంతో పశువుల మానసిక పరిస్థితి మెరుగవుతుందని, ఆరోగ్యంగా ఉంటాయని పాడి రైతులకు నచ్చజెప్పి వారితో కచేరి నిర్వహణకు ఒప్పిస్తున్నాడు. జాకబ్‌ బృంద సభ్యులు మొదట ఆవులకు సంగీతం అలవాటు కావడానికి స్పీకర్లతో సంగీతం వినిపిస్తారు. ఆవులు సంగీతంపై ఆసక్తి చూపినప్పుడు వయోలిన్‌తో సంగీతం వినిపిస్తున్నారు.

ఆవులు ఒక్కో రకమైన సంగీతానికి ఒక్కో రకంగా స్పందిస్తున్నాయని జాకబ్‌ వెల్లడించాడు. మోడ్రన్‌ సంగీతాన్ని ఆవులు పెద్దగా ఇష్టపడట్లేదని.. ఆ సంగీతం మొదలుపెట్టగానే అవి వెళ్లిపోతున్నాయని చెప్పాడు. వయోలిన్‌ సంగీతాన్ని మాత్రం ఆవులు సేదతీరుతూ ఆస్వాదిస్తున్నాయట. వేదికలు తిరిగి తెరుచుకున్నా.. ఆవుల కోసం సంగీత కచేరీలు నిర్వహిస్తూనే ఉంటామని జాకబ్‌ స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు