ఈ గొర్రె ధర తెలిస్తే.. బుర్ర తిరుగుద్ది!

గొర్రె ధర ఎంత ఉంటుంది? రూ. వేలల్లో ఉండొచ్చు. మేలైన జాతి గొర్రెలైతే రూ. లక్షలు విలువ చేయొచ్చు. కానీ ఇటీవల వేలంలో ఓ గొర్రె ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. ఎంతో తెలుసా

Published : 02 Sep 2020 01:50 IST

(బ్రిటీష్‌ టెక్సెస్‌ షీప్‌ సోసైటీ ఫేస్‌బుక్‌‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: గొర్రె ధర ఎంత ఉంటుంది? రూ.వేలల్లో ఉండొచ్చు. మేలైన జాతి గొర్రెలైతే రూ.లక్షలు విలువ చేయొచ్చు. కానీ ఇటీవల వేలంలో ఓ గొర్రె ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. దీని ధరెంతో తెలుసా? అక్షరాలా రూ. 3.57 కోట్లు!!

నెదర్లాండ్స్‌లోని టెక్సెల్‌లో గొర్రెల పరిశ్రమ ఉంది. ఇక్కడి గొర్రెలకు ఉత్తమ జాతి గొర్రెలుగా పేరుంది. అయితే ఇటీవల కొత్తగా జన్యుపరంగా ఉత్తమమైన గొర్రె ‘డబుల్‌ డైమండ్‌’ను వేలంలో పెట్టారు. దీనిని సొంతం చేసుకునేందుకు యూకే వ్యాప్తంగా పాడి రైతులు పోటీ పడ్డారు. అయితే దీని ధర మొదటి నుంచి అధికంగా ఉండటంతో ఎలాగైనా ఈ గొర్రెను దక్కించుకోవాలని వేలానికి ముందే కొందరు సంయుక్తంగా కొనాలని నిర్ణయించుకున్నారట. వేలానికి రాగానే ఓ ముగ్గురు పాడి రైతులు కలిసి అత్యధికంగా 4,90,000డాలర్లు (రూ.3,75,78,379)పెట్టి ఆ గొర్రెను సొంతం చేసుకున్నారు. గతంలో ఇక్కడి వేలంలో అమ్ముడుపోయిన గొర్రె ధర రూ. 2.24 కోట్లేనట. ఇప్పుడు ఈ నెలల వయసున్న ‘డబుల్‌ డైమెండ్‌’ గొర్రెను తీసుకెళ్లి.. పెరిగిన తర్వాత దాని వీర్యం సేకరించి కృత్రిమ గర్భధారణతో ఈ జాతి గొర్రెలను మరిన్ని సృష్టించాలని రైతులు భావిస్తున్నారట!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని