Modi: ఉత్తరాఖండ్‌ టోపీ.. మణిపూర్‌ కండువా..విభిన్న వస్త్రధారణతో ప్రధాని..!

ప్రధాని నరేంద్రమోదీ ప్రతి వేడుకలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విభిన్న వస్త్రధారణతో దర్శనమిస్తుంటారు. ఈ రోజు గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ఆయన తల మీద టోపీ, మెడలో కండువాను ధరించి కనిపించారు. టోపీ ఉత్తరాఖండ్‌ సంప్రదాయానికి చిహ్నం కాగా.. కండువా మణిపూర్ సంస్కృతిని చాటి చెప్పింది.

Published : 26 Jan 2022 14:47 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రతి వేడుకలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విభిన్న వస్త్రధారణతో దర్శనమిస్తుంటారు. ఈ రోజు గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ఆయన తలపై టోపీ, మెడలో కండువాను ధరించి కనిపించారు. టోపీ ఉత్తరాఖండ్‌ సంప్రదాయానికి చిహ్నం కాగా.. కండువా మణిపూర్ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది.

అలాగే ఆ టోపీపై బ్రహ్మకమలం గుర్తు ఉంది. అది ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం. కేదర్‌నాథ్‌ ఆలయంలో ఎప్పుడు పూజలు చేసినా.. మోదీ బ్రహ్మకమలం పుష్పాలను ఉపయోగిస్తారని అధికారులు అన్నారు. కాగా, దీనిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. 1.25 కోట్ల తన రాష్ట్ర వాసుల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక మోదీ ధరించిన ఆ కండువా చేతితో నేసినది. ఇది మణిపూర్‌లోని మేటీ తెగ వినియోగించే ప్రత్యేక వస్త్రం. 

ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల్లో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఉత్తరాఖండ్‌, మణిపూర్ కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఆ రాష్ట్రాల సంస్కృతికి తగినట్టుగా మోదీ వస్త్రధారణ ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 14న, మణిపూర్‌లో ఫిబ్రవరి 27, మార్చి మూడో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని