అది ఇప్పటి ఫొటో కాదు: జవాన్‌ బంధువులు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో అదృశ్యమైన కోబ్రా కమాండ్‌ రాకేశ్‌ సింగ్‌ తమవద్దే ఉన్నాడంటూ మావోయిస్టులు ఓ ఫొటో విడుదల చేశారు. అయితే ఆ ఫొటో ఇప్పటిది కాదని రాకేశ్‌సింగ్‌ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు....

Updated : 07 Apr 2021 17:49 IST

బర్నాయ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో అదృశ్యమైన కోబ్రా కమాండో రాకేశ్‌ సింగ్‌ తమవద్దే ఉన్నాడంటూ మావోయిస్టులు ఓ ఫొటో విడుదల చేశారు. అయితే ఆ ఫొటో ఇప్పటిది కాదని రాకేశ్‌సింగ్‌ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అది దాదాపు సంవత్సరం క్రితం ఫొటో అని పేర్కొంటున్నారు. చివరిసారి రాకేశ్‌ ఇంటికి వచ్చినప్పుడు అతడి సెల్‌ఫోన్‌లో ఆ ఫొటో చూసినట్లు జవాన్‌ బంధువు ప్రవీణ్‌సింగ్‌ తెలిపారు. మావోయిస్టులు మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని ఆరోపించారు. 

ఈ నేపథ్యంలో రాకేశ్‌సింగ్‌ బంధువులు బుధవారం నిరసన చేపట్టారు. అతడి స్వస్థలం జమ్మూ కశ్మీర్‌లోని బర్నాయ్‌లో జమ్మూ-పూంచ్‌ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. జవాన్‌ను మావోయిస్టుల చెర నుంచి సురక్షితంగా కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన భర్తను కాపాడాలని రాకేశ్‌ భార్య మీనూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. 

బీజాపూర్‌-సుకుమా జిల్లాల సరిహద్దు అటవీప్రాంతంలో ఈనెల 3వ తేదీన జవాన్లకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 23 మంది జవాన్లు మృతిచెందారు. కోబ్రా యూనిట్‌కు చెందిన కమాండో రాకేశ్‌సింగ్‌ కనిపించకుండాపోయారు.అనంతరం తమ వద్ద ఉన్నాడని మావోయిస్టులు ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు