Jammu Kashmir: ‘మా సహనాన్ని పరీక్షించొద్దు.. అఫ్గాన్‌లో ఏం జరుగుతోందో చూస్తున్నారుగా’

అఫ్గాన్‌ పరిస్థితులను ఉటంకిస్తూ పీడీపీ నేత, జమ్మూ- కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. కుల్గాం జిల్లాలో శనివారం ఓ ర్యాలీని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘కశ్మీర్‌వాసుల ఇబ్బందులను భరించాలంటే ధైర్యం కావాలి. ఏ రోజైతే వారిలో ఓపిక నశిస్తుందో...

Published : 22 Aug 2021 01:03 IST

శ్రీనగర్‌: అఫ్గాన్‌ పరిస్థితులను ఉటంకిస్తూ పీడీపీ నేత, జమ్మూ- కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. కుల్గాం జిల్లాలో శనివారం ఓ ర్యాలీని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘‘కశ్మీర్‌వాసుల ఇబ్బందులను భరించాలంటే ధైర్యం కావాలి. ఏ రోజైతే వారిలో ఓపిక నశిస్తుందో.. మీరు నాశనం అవుతారు. మా సహనాన్ని పరీక్షించొద్దు. అఫ్గానిస్థాన్‌లో ఏం జరుగుతోందో చూస్తున్నారుగా. అమెరికా ఒక బలమైన శక్తి. కానీ ఆ దేశం విడిచివెళ్లాల్సి వచ్చింది’’ అని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

‘‘మీకు ఇంకా అవకాశం ఉంది. కశ్మీర్‌ ప్రజలతో మాట్లాడండి. శాంతి స్థాపన ప్రక్రియను పునః ప్రారంభించండి. ఆర్టికల్‌ 370ను పునరుద్ధరించండి’’ అని ముఫ్తీ డిమాండ్‌ చేశారు. మరోవైపు అఫ్గాన్‌ ప్రజలకు వ్యతిరేకంగా ఏ చర్యలకు పాల్పడవద్దని తాలిబన్లను కోరుతున్నానన్నారు. ముఫ్తీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ప్రస్తుత సమయంలో ఇలాంటి ప్రకటనలు చేయడం మానుకోవాలని సూచించారు. జమ్మూ- కశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో భాగమేనని పేర్కొన్నారు. ముఫ్తీ ఇక్కడ తాలిబన్ల పాలన కోరుకుంటున్నారని భాజపా జమ్మూ- కశ్మీర్ అధ్యక్షుడు రవీందర్‌ రైనా విమర్శించారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ.. జో బైడెన్‌ కాదు. స్థానికంగా ఉగ్రవాదులను ఏరివేస్తాం’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని