Loksabha:ఎంపీలకు స్పీకర్‌ ఓం బిర్లా లేఖ

పార్లమెంట్‌ సభ్యులకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా లేఖ రాశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో నియోజకవర్గాల్లో చేపట్టిన సహాయక చర్యలపై నివేదిక ఇవ్వాలని సూచించారు.........

Updated : 09 Jun 2021 11:33 IST

దిల్లీ: పార్లమెంట్‌ సభ్యులకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా లేఖ రాశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో నియోజకవర్గాల్లో చేపట్టిన సహాయక చర్యలపై నివేదిక ఇవ్వాలని సూచించారు. ఎంపీలు ఇచ్చిన నివేదికలు భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా ఉత్తమ పద్ధతులను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇలాంటి తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులుగా జనంతో ఉండటం, ప్రతి విషయంలో వారికి సహాయం చేయడం పార్లమెంట్‌ సభ్యుల బాధ్యత అని లేఖలో పేర్కొన్నారు. 

‘‘ఈ ప్రతికూల పరిస్థితుల్లో  ఎక్కువ సమయం మీరు నియోజకవర్గాల్లో ప్రజలకు సాయం చేయడం కోసమే వెచ్చించారని విశ్వసిస్తున్నాను. ప్రజలకు నైతిక మద్దతు ఇవ్వడమే కాకుండా వారి సమస్యలను పరిష్కరించేలా ప్రయత్నించారు. మీకు ఎదురైన అనుభవాలను, మీరు కృషిని దేశంతో పంచుకుంటే.. తద్వారా భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మరింత మెరుగైన పద్ధతులను అవలంబించవచ్చు’’ అని పేర్కొన్నారు.

మరోవైపు, రాజస్థాన్‌లోని కోట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓం బిర్లా.. తన నియోజకవర్గంలో కొవిడ్‌తో తల్లిదండ్రులను/ సంపాదించే వ్యక్తిని కోల్పోయే కుటుంబాలకు చెందిన విద్యార్థుల మెడికల్‌, ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు ఉచిత కోచింగ్‌, వసతి కల్పిస్తానని ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని