Lockdown: బ్రిటన్‌కు ‘డెల్టా’ వేరియంట్‌ కష్టాలు!

భారత్‌లో తొలుత వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియంట్‌పై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి కట్టడికి ఆ దేశంలో విధించిన లాక్‌డౌన్ ఎత్తివేతను ఈ కొత్త వేరియంట్‌ మూలంగా వాయిదా......

Published : 13 Jun 2021 14:04 IST

లండన్‌: భారత్‌లో తొలుత వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియంట్‌పై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కొత్త వేరియంట్‌ మూలంగా.. మహమ్మారి కట్టడికి ఆ దేశంలో విధించిన లాక్‌డౌన్ ఎత్తివేతను వాయిదా వేయాల్సి రావొచ్చని సంకేతాలు ఇచ్చారు.

భారీ ఎత్తున చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సత్ఫలితాలివ్వడంతో త్వరలోనే బ్రిటన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనవచ్చని అంతా భావించారు. ఆ దిశగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు క్రమంగా సడలించాలని యోచిస్తోంది. కానీ, వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్‌.. బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వాన్ని గందరగోళంలో పడేసింది. లాక్‌డౌన్‌ను మరో నాలుగు వారాల పాటు పొడిగించాలని భావిస్తున్నట్లు సమాచారం. అంటే జులై 19 వరకు బ్రిటన్‌లో కఠిన ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది.

తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు అధికారులు సమాచారాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నారని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు. అయితే, మే చివరలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేకపోవడంతో దాదాపు లాక్‌డౌన్‌ పొడిగింపు నిర్ణయమే వెలువడే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని