Kim Jong un: అజేయ సైన్యం నిర్మిస్తా.. కిమ్‌ భీషణ ప్రతిజ్ఞ..!

అజేయ సైన్యాన్ని నిర్మిస్తానని ఉత్తరకొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రతిజ్ఞ చేశారు. అమెరికా అనుసరిస్తున్న ఉద్రిక్త పాలసీల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం

Updated : 12 Oct 2021 15:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  అజేయ సైన్యాన్ని నిర్మిస్తానని ఉత్తరకొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రతిజ్ఞ చేశారు. అమెరికా అనుసరిస్తున్న ఉద్రిక్త పాలసీల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. ఉత్తర కొరియా ఆయుధాభివృద్ధి కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే అని తెలిపారు.  అక్కడ నిర్వహించిన ఓ రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  ఉత్తర కొరియా ఇటీవలే సూపర్‌ సోనిక్‌, యాంటీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్షిపణులను ప్రయోగించింది. 

సెల్ఫ్‌ డిఫెన్స్‌ 2021 ఎగ్జిబిషన్‌ను ప్యాంగ్‌యాంగ్‌లో ప్రారంభించారు. దీనిలో ట్యాంక్‌లు, క్షిపణులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కిమ్‌ ప్రసంగించారు.  దక్షిణ కొరియా సైనిక పరంగా బలపడటంపై మాట్లాడారు. ఉత్తరకొరియా తన పొరుగు దేశంతో యుద్ధం చేయాలనుకోవడం లేదని తెలిపారు. ‘‘మేము యుద్ధం ప్రారంభించడం గురించి గానీ, యుద్ధాన్ని నిరోధించడం, దేశ సార్వభౌమత్వ రక్షణ కోసం ప్రత్యర్థుల్లో భయాన్ని పెంచడంపై మాట్లాడతాము’’ అని పేర్కొన్నారు. ఉత్తర కొరియా- దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తలు పెరగడానికి అమెరికానే కారణమని నిందించారు. గత కొన్ని నెలలుగా ఉత్తరకొరియా వరుస క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. మరోపక్క ఫ్లుటోనియం తయారు చేసే రియాక్టర్‌ను కూడా పునరుద్ధరించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని