జపనీస్‌ భాష నేర్చుకుంటోన్న సీఎం.. అక్కడ తొలి విద్యార్థి ఆయనే!

చదువుకోవాలనే ఆసక్తి, నేర్చుకోవాలనే తపన ఉండాలే గానీ వయసు ఏ మాత్రం అడ్డం కాదంటున్నారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌. అందుకే 67ఏళ్ల

Published : 26 Nov 2021 20:49 IST

కురుక్షేత్ర: చదువుకోవాలనే ఆసక్తి, నేర్చుకోవాలనే తపన ఉండాలే గానీ వయసు ఏ మాత్రం అడ్డం కాదంటున్నారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌. అందుకే 67ఏళ్ల వయసులో ఉన్న ఆయన.. జపాన్‌ భాష నేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం స్థానిక కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో తన పేరును ఎన్‌రోల్‌ చేసుకున్నారు. 

కురుక్షేత్ర యూనివర్శిటీలో జపాన్‌ కల్చర్‌ అండ్‌ లాంగ్వేజ్‌ ఆన్‌లైన్‌ బేసిక్‌ సర్టిఫికెట్‌ కోర్సును ఇటీవలే ప్రారంభించారు. మూడు నెలలు పాటు శిక్షణ ఇచ్చే ఈ కోర్సులో జపనీస్‌ భాషతో పాటు అక్కడి సంస్కృతి, సంప్రదాయాల గురించి కూడా చెబుతారు. ఈ కోర్సు చేసేందుకు ముఖ్యమంత్రి ఖట్టర్‌ ఈ మధ్యే దరఖాస్తు చేసుకున్నారు. ఈ కోర్సుకు ఎన్‌రోల్‌ చేసుకున్న తొలి విద్యార్థి కూడా ఈయనే కావడం విశేషం. ఈ సందర్భంగా సీఎం ఖట్టర్‌ మాట్లాడుతూ.. ‘‘మన విజ్ఞానం, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలి. నాకు ముందునుంచీ విదేశీ భాషలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువ. అందుకే జపనీస్‌ భాష నేర్చుకునేందుకు కురుక్షేత్ర యూనివర్శిటీలో ఎన్‌రోల్‌ చేసుకున్నాను’’ అని తెలిపారు. 

ఈ సందర్భంగా సీఎం నిర్ణయాన్ని యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ సోమ్‌నాథ్‌ సచ్‌దేవ్‌ అభినందించారు. ‘‘ఇది మా యూనివర్శిటీకే గర్వకారణం. ఆయన విద్యార్థిగా రావడం.. టీచింగ్ సిబ్బంది‌, విద్యార్థులకు ఎంతగానో స్ఫూర్తినిస్తుంది. ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ కోర్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని