Arvind Kejriwal: గ్రేట్‌ ఖలీతో సీఎం కేజ్రీవాల్‌ భేటీ.. పంజాబ్‌ ఎన్నికల కోసమేనా..?

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల ప్రచారం జోరు ఊపందుకుంది. ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందే ప్రజలకు ఆమ్‌ ఆద్మి పార్టీని దగ్గర చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు దిల్లీ సీఎం, ఆప్‌ పార్టీ వ్యవస్థాపకుడు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.

Published : 19 Nov 2021 01:43 IST

దిల్లీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల ప్రచారం జోరు ఊపందుకుంది. ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందే ప్రజలకు ఆమ్‌ ఆద్మీ పార్టీని దగ్గర చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు దిల్లీ సీఎం, ఆప్‌ పార్టీ వ్యవస్థాపకుడు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌. ఈనేపథ్యంలో గురువారం వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) స్టార్‌ దలీప్‌ సింగ్‌ రానా ‘ది గ్రేట్‌ ఖలీ’ని కలిశారు. త్వరలో పంజాబ్‌లో జరగబోయే ఎన్నికల్లో  ఆప్‌ పార్టీకే  ఖలీ మద్దతు ఇస్తున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఇదే విషయాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు కేజ్రీవాల్‌.

‘‘ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రెజ్లర్‌ ది గ్రేట్‌ ఖలీని కలిశాను. దిల్లీలో విద్యుత్‌, నీరు, పాఠశాల, ఆసుపత్రుల అభివృద్ధిని ఆయన మెచ్చుకున్నారు. ఇదే స్ఫూర్తి మేమంతా కలిసి  పంజాబ్‌ను మారుస్తాం’’ అని ట్వీట్‌ చేశారు. దిల్లీలో జరిగిన అభివృద్ధిని చూసిన దలీప్‌.. సమాజ శ్రేయస్సు కోసం ఏ విధంగానైనా కేజ్రీవాల్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇటీవలే పది మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడిన జాబితాను ఆప్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా అందులో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని