Published : 12/11/2021 23:20 IST

KSRTC: బస్సులో పాటలు పెడుతున్నారా.. జాగ్రత్త!

బెంగళూరు: బస్సులో వెళ్తున్నప్పుడు ఎవరైనా పెద్దగా సౌండ్‌ పెట్టుకుని వీడియోలు చూడటం.. అందరికి వినిపించేలా పాటలు పెట్టడం.. తోటి ప్రయాణికులకు ఇబ్బందికర వ్యవహారమే. వద్దని చెప్పినా మాట వినని వారు కొందరు. ఇకనుంచి అలాంటివారిని బస్సులోంచి కిందికి దించేయొచ్చు. అవును.. కర్ణాటక హైకోర్టు తాజాగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం కేఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు తమ మొబైల్ స్పీకర్లలో అధిక సౌండ్‌తో పాటలు ప్లే చేయడం నిషేధం.

బస్సు లోపల ‘నాయిస్‌ డిస్ట్రబెన్స్‌’ విషయంలో ఆంక్షలు విధించాలని కోరుతూ ఓ పిటిషనర్‌ కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మొబైల్‌ ఫోన్‌లలో అధిక వాల్యూమ్‌లో పాటలు, వీడియోలు ప్లే చేయడాన్ని కట్టడి చేయాలని అందులో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. బస్సులోని సిబ్బంది తొలుత పెద్ద సౌండ్‌తో పాటలు వినేవారిని వారించాలని, సూచనలు పట్టించుకోని పక్షంలో వారిని బస్సు నుంచి కిందికి దించేయొచ్చని హైకోర్టు పేర్కొంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని