కుంభమేళాకు వెళ్లొస్తే స్వీయనిర్బంధం తప్పనిసరి

బెంగళూరు: కొవిడ్‌ ఉద్ధృతి ధాటికి కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ కుంభమేళాకు వెళ్లిన కర్ణాటక యాత్రికులు రాష్ట్రానికి తిరిగొచ్చాక తప్పనిసరిగా స్వీయనిర్బంధంలో ..

Published : 16 Apr 2021 01:16 IST

కర్ణాటక ప్రభుత్వ నూతన మార్గదర్శకాలు

బెంగళూరు: కొవిడ్‌ ఉద్ధృతి ధాటికి కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ కుంభమేళాకు వెళ్లిన కర్ణాటక యాత్రికులు రాష్ట్రానికి తిరిగొచ్చాక తప్పనిసరిగా స్వీయనిర్బంధంలో ఉండాలని సూచించింది. ఈ మేరకు నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కొవిడ్‌ టెస్టును విధిగా చేయించుకోవాలని కోరింది. పరీక్ష ఫలితాల్లో నెగిటివ్‌ వచ్చిన తరవాతే దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్‌ ట్విటర్‌లో‌ పేర్కొన్నారు. మరోవైపు దీనికి సంబంధించిన తాజా ఉత్తర్వులను ఆ రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కేవీ త్రిలోక్‌చంద్ర బుధవారం జారీ చేశారు. కాగా కుంభమేళాకు వెళ్లే యాత్రికులు ఆర్టీపీసీఆర్‌ టెస్టును తప్పనిసరిగా చేయించుకోవాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని