Iran: అమెరికా అనుకుంటే ఒప్పందం కుదురుతుంది..!

పీ5+1 దేశాలతో అణుఒప్పందం కోసం వియన్నాలో జరుగుతున్న చర్చలపై ఇరాన్‌ స్పందించింది. చిత్తశుద్ధి ఉంటే ఈ ఒప్పందం అసాధ్యమేమీ కాదని పేర్కొంది.

Published : 28 Jun 2021 01:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పీ5+1 దేశాలతో అణుఒప్పందం కోసం వియన్నాలో జరుగుతున్న చర్చలపై ఇరాన్‌ స్పందించింది. చిత్తశుద్ధి ఉంటే ఈ ఒప్పందం అసాధ్యమేమీ కాదని పేర్కొంది. అమెరికా గతంలో ఈ ఒప్పందానికి తూట్లు పొడించిందని విమర్శించింది. చర్చల్లో చాలా ప్రతిపాదనలు తామే చేసినట్లు ఇరాన్‌ తెలిపింది. ఈ విషయాన్ని ఇరాన్‌ విదేశాంగశాఖ ప్రతినిధి సయిద్‌ ఖాతిబ్‌జాదే పేర్కొన్నారు. ‘‘ఒప్పందం సాధ్యమని ఇప్పటికీ భావిస్తున్నాం. ట్రంప్‌ విఫల చరిత్రను వదిలించుకోవాలని అమెరికా భావించాలి. ఇరాన్‌ ఇంకెప్పుడు దీనిపై చర్చలు జరపదు’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. 

పీ5+1 దేశాలతో 2015లో కుదుర్చుకొన్న ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు ఇరాన్‌ ప్రయత్నాలు చేస్తోంది.  ఈ ఒప్పందం నుంచి 2018లో అమెరికా వైదొలగింది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో కొన్ని అడ్డంకులు తొలగాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ‘పర్యవేక్షణ ఒప్పందం’ రద్దుకావడంతో దానిపై చర్చలు ఓ కొలిక్కి రావడంలేదు.  అణు ఒప్పందం కుదిరితే ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు తొలగే అవకాశం ఉంది. ఈ చర్చలు ఏప్రిల్‌లో మొదలయ్యాయి. తొలుత ఇవి జులై నాటి ముగిసే అవకాశం ఉందని భావించినా.. పరిస్థితులు చూస్తుంటే మరింతకాలం కొనసాగే అవకాశం ఉంది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు