army: సెకండ్‌వేవ్‌కు ఎదురొడ్డి..!

సైనిక దళాలు కొవిడ్‌ రెండో దశను అద్భుతంగా ఎదుర్కొంటున్నాయి. గతేడాది  సాయుధ దళాల్లో మొత్తం 52,000 కొవిడ్‌కేసులు వచ్చాయి.

Published : 24 May 2021 16:15 IST

 సాయుధ దళాల్లో బాగా తగ్గిన కొవిడ్‌ కేసులు

ఇంటర్నెట్‌డెస్క: సైనిక దళాలు కొవిడ్‌ రెండో దశను అద్భుతంగా ఎదుర్కొంటున్నాయి. గతేడాది  సాయుధ దళాల్లో మొత్తం 52,000 కొవిడ్‌కేసులు వచ్చాయి. భారత్‌కు మొత్తం సాయుధ బలగాల్లో 17లక్షల మంది ఉన్నారు. వీరిలో 142 మంది కొవిడ్‌ కారణంగా మరణించారు. ఆ తర్వాత టీకాలు అందుబాటులోకి రావడంతో దళాలు అత్యంత వేగంగా సిబ్బందికి టీకాలను వేయించాయి. మొత్తం మీద రెండు డోసుల టీకాలు తీసుకొన్నవారు 90శాతానికి మించి ఉన్నారు. దీంతో రోజువారి మొత్తం సైనిక దళాల్లో రోజువారి నమోదవుతున్న కేసుల సంఖ్య 200కు పడిపోయింది. వీరిలో కూడా 140 కేసులు కేవలం ఆర్మీ నుంచే ఉంటున్నాయి. వచ్చిన కేసుల్లో అత్యధిక శాతంలో ఎటువంటి లక్షణాలు లేనవి, స్వల్ప లక్షణాలు ఉన్నవి మాత్రమే ఉంటున్నాయి. వీరికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండటంలేదు. 

ఇప్పటి వరకు సైనిక దళాల్లో టీకాలు తీసుకున్న వారిలో  0.40శాతం మందికి మాత్రమే కొవిడ్‌ సోకింది. 0.004శాతం మంది మాత్రమే ఆసుపత్రి పాలయ్యారు. అంటే కొవిడ్‌ సోకిన వారిలో కూడా 1శాతం మాత్రమే ఆసుపత్రిలో చేరారని ఆర్మీవర్గాలు వెల్లడించాయి. దేశంలో కొవిడ్‌ కేసు సెకండ్‌ వేవ్‌ అత్యధికంగా ఉన్నప్పుడు నిత్యం 200 కేసులు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం ఆ సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఈ కొవిడ్‌ కేసులు నగరాల్లో ఉన్న కంటోన్మెంట్లు వంటి ప్రాంతాల్లోనే నమోదయ్యాయని.. సరిహద్దుల్లో ఉన్న వారిలో నమోదు కాలేదని పేర్కొంది. 

సైనిక దళాల్లో కేసులు తగ్గినా.. క్వారంటైన్‌ వంటి కొవిడ్‌ ప్రొటోకాల్‌ను మాత్రం విస్మరించలేదు. దాదాపు ఏడాదిన్నరగా దీనిని పాటిస్తూనే ఉంది.      గతేడాది లద్దాఖ్‌కు దళాలను తరలించే సమయంలో కొవిడ్‌ కేసులు రావడంతో దీనిని ప్రవేశపెట్టింది. 

ఈ ఏడాది మార్చినాటికి పార్లమెంట్‌కు ఇచ్చిన సమాచారం మేరకు సైన్యంలో 44,766 కేసులు వచ్చాయి. వీటిల్లో 119 మరణాలు సంభవించాయి. ఇక ఇదే మే 19 నాటికి 52 వేల కేసులు నమోదయ్యాయి. దళాల కుటుంబ సభ్యుల్లో 14వేల మందికి ఈ వ్యాధి సోకింది. సెకండ్‌ వేవ్‌లో కేవలం మే 10 నాటికి 5,134 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దళాల్లో 99శాతం మందికి ఒక డోసు టీకా అందించగా.. 90శాతం మందికి రెండో డోసు కూడా పూర్తి చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని