Airlines: కరోనా దెబ్బ.. ఎయిర్‌లైన్లకు రూ.19,564కోట్ల నష్టం

గత రెండేళ్లుగా వణికిస్తోన్న కరోనా మహమ్మారి దేశంలో దాదాపు అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. కొవిడ్‌ దెబ్బకు విమానాయనం కూడా భారీగా కుదేలైంది. నిబంధనల

Published : 06 Dec 2021 20:26 IST

దిల్లీ: గత రెండేళ్లుగా వణికిస్తోన్న కరోనా మహమ్మారి దేశంలో దాదాపు అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. కొవిడ్‌ దెబ్బకు విమానయానరంగ పరిశ్రమ కూడా భారీగా కుదేలైంది. నిబంధనల పేరుతో విధించిన ఆంక్షలు.. గతేడాది విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టులకు పెను నష్టాన్ని తెచ్చిపెట్టాయి. కరోనా కారణంగా ఏడాది కాలంలో ఎయిర్‌లైన్లు దాదాపు రూ.20 వేలకోట్ల మేర నష్టాలను చవిచూశాయి.

‘‘విమానయాన రంగంపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపించింది. విమాన సర్వీసులు నిలిపివేయడంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో విమానయాన సంస్థలు దాదాపు రూ.19,564కోట్లు, విమానాశ్రయాలు రూ. 5,116కోట్ల మేర నష్టపోయాయి’’ అని పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. 

2020 ఆరంభంలో దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించిన విషయం తెలిసిందే. దీంతో వైరస్‌ కట్టడిలో భాగంగా ఆ ఏడాది మార్చి 25 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానయాన సర్వీసులను కేంద్రం నిలిపివేసింది. అయితే ఆ తర్వాత ఆంక్షలను కాస్త సడలిస్తూ కొన్ని సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ పూర్తి స్థాయిలో నిషేధాన్ని ఎత్తివేయలేదు. కొన్ని దేశాలతో ‘ఎయిర్‌ బబుల్‌’ ఒప్పందం కుదుర్చుకొని.. పరిమిత ఆంక్షలతో ప్రత్యేక విమానాలను నడుపుతూ వస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని