Omicron: దేశంలో మరో ఒమిక్రాన్‌ కేసు.. ఎక్కడంటే? 

దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

Updated : 05 Dec 2021 13:32 IST

దిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు కేసులు వెలుగులోకి రాగా.. తాజాగా దిల్లీలో మరో కేసు నిర్ధారణ అయ్యింది. ఇటీవల టాంజానియా నుంచి భారత్‌కు వచ్చిన వ్యక్తి(37)కి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం బాధితుడు నగరంలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దిల్లీలో నమోదైన తొలి కేసు ఇదే. బాధితుడి ప్రయాణ వివరాలు సేకరించిన అధికారులు అతనితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారందరినీ వెతికే పనిలో పడ్డారు. 

ఇంతకుముందు కర్ణాటకలో ఇద్దరు వ్యక్తులకు క్తొత వేరియంట్‌ సోకిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు దక్షిణాఫ్రికా దేశస్థుడు కాగా, మరొకరు స్థానిక ప్రభుత్వ వైద్యుడు. కాగా.. శనివారం మరో ఇద్దరికి ఒమిక్రాన్‌ సోకినట్లు గుర్తించారు. వీరిలో ఒకరు గుజరాత్‌కు, మరొకరు మహారాష్ట్రకు చెందినవారు. దీంతో కరోనా కొత్త వేరియంట్‌ మొత్తం కేసులు ఐదుకు చేరాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని