నేపాల్‌ ఆర్మీకి.. భారత సైన్యం టీకాలు

కొవిడ్ మహమ్మారిపై పోరులో భాగంగా అనేక దేశాలకు ‘వ్యాక్సిన్‌’ సహకారం అందించిన భారత్‌.. పొరుగు దేశమైన నేపాల్‌ సైన్యానికి కూడా స్వదేశీ టీకాలకు అందించింది. ఇరు దేశాల

Published : 29 Mar 2021 18:40 IST

కాఠ్‌మాండూ: కొవిడ్ మహమ్మారిపై పోరులో భాగంగా అనేక దేశాలకు ‘వ్యాక్సిన్‌’ సహకారం అందించిన భారత్‌.. పొరుగు దేశం నేపాల్‌ సైన్యానికి టీకాలను అందించింది. ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా నేపాల్‌ ఆర్మీకి.. భారత్‌ సైన్యం లక్ష డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్లను బహుమతిగా ఇచ్చింది. 

త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ఆర్మీ అధికారులు వీటిని నేపాల్ సైనికాధికారులకు అందజేసినట్లు భారత ఎంబసీ సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. అంతకుముందు నేపాల్‌ ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కోసం భారత ప్రభుత్వం ఆ దేశానికి పది లక్షల స్వదేశీ వ్యాక్సిన్లను పంపించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ హిమాలయ దేశానికి 8లక్షల టీకా డోసులను ఇవ్వనున్నట్లు చైనా కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా నేడు 5లక్షల డోసులను ఆ దేశానికి పంపించింది. నేపాల్‌లో ఇప్పటివరకు 2.7లక్షల మందికి కరోనా వైరస్‌ సోకగా.. 3,027 మంది  మహమ్మారికి బలయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని