మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా..

భారత్‌లో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆ కేసుల సంఖ్య 25 వేలు దాటడం కలవరపెడుతోంది.

Updated : 14 Mar 2021 12:36 IST

25 వేలు దాటిన కొత్త కేసులు

దిల్లీ : భారత్‌లో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆ కేసుల సంఖ్య 25 వేలు దాటడం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో 8,64,368 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 25,320 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,59,048కి చేరింది.  క్రియాశీల కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలో ప్రస్తుతం 2,10,544 యాక్టివ్‌ కేసులుండగా.. ఆ శాతం 1.85కి పెరిగింది. మరోవైపు నిన్న 16,637 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 1,09,89,897(96.75శాతం)గా ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 161 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 1,58,607కి చేరింది.

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం..
ఇక మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 15,602 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. 88 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. ముంబయి,నాగ్‌పూర్‌లలో కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఇక దేశంలో రెండో విడత వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. నిన్న 15,19,952 కోవిడ్‌ టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా వేసిన టీకాల సంఖ్య 2,97,38,409కి చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని