India Corona: భారీగా పెరిగిన కొత్త కేసులు.. ఎంతమందికి కరోనా సోకిందంటే..?

దేశంలో కరోనావైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతూ 3 లక్షలకు సమీపించాయి.

Published : 19 Jan 2022 09:55 IST

15 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు

దిల్లీ: దేశంలో కరోనావైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతూ 3 లక్షలకు సమీపించాయి. మంగళవారం 18 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 2,82,970 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజు కంటే 44,889(18 శాతం మేర) కొత్త కేసులు అదనంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 15.13 శాతానికి పెరిగిపోయింది. ఇక, మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 24 గంటల వ్యవధిలో 441 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3 కోట్ల 79 లక్షల మంది మహమ్మారి బారినపడ్డారు. 4,87,202 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.

* మరోపక్క తాజా ఉద్ధృతికి ఆజ్యం పోస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటివరకూ 8,961 మందిలో బయటపడింది.

* కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో క్రియాశీల కేసులు 18 లక్షలు దాటేశాయి. క్రియాశీల రేటు 4.83 శాతానికి పెరిగింది. అలాగే నిన్న 1,88,157 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ 3.55 కోట్ల మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 93.88 శాతంగా ఉంది.

* ఇక, నిన్న 76,35,229 మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా 158 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్నటివరకూ 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వారికి 3.7 కోట్ల డోసులు అందగా.. 56,66,263 ప్రికాషనరీ డోసుల్ని కేంద్రం పంపిణీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు