Republic Day: శ్రీనగర్ లాల్చౌక్లో త్రివర్ణ రెపరెపలు.. 30ఏళ్లలో తొలిసారి!

జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​ లాల్​చౌక్ క్లాక్​ టవర్​పై జాతీయ పతాకం ఆవిష్కృతమైంది. ఈ చారిత్రక క్లాక్‌ టవర్‌పై గత 30 ఏళ్లలో త్రివర్ణ పతాకం ఎగరడం ఇదే తొలిసారి.......

Updated : 23 Jan 2024 16:42 IST

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​ లాల్​చౌక్ క్లాక్​ టవర్​పై జాతీయ పతాకం ఆవిష్కృతమైంది. ఈ చారిత్రక క్లాక్‌ టవర్‌పై గత 30 ఏళ్లలో త్రివర్ణ పతాకం ఎగరడం ఇదే తొలిసారి. సామాజిక కార్యకర్తలు సాజిద్ యూసఫ్​ షా, సాహిల్​ బషీర్‌ భట్‌లు క్రేన్ సాయంతో క్లాక్ టవర్​పై జెండా ఎగరవేశారు.

జనవరి 26న ఈ ఐకానిక్‌ క్లాక్‌ టవర్‌పై పాకిస్థాన్ జెండాను ఎగురవేయడం లేదా సెక్షన్ 144 విధించడం ఇక్కడ పరిపాటిగా సాగుతుండేది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కూడా లాల్ చౌక్‌లో మువ్వెన్నెల జెండాను ఎగురవేసేందుకు అనుమతిని లభించలేదు. కానీ ఈసారి మాత్రం ఇద్దరు సామాజిక కార్యకర్తలు స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకొని జెండాను ఆవిష్కరించారు.

జెండాను ఎగురవేసిన అనంతరం సాజిద్ యూసుఫ్ షా మాట్లాడుతూ..‘ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వానికే ఈ క్రెడిట్‌ దక్కుతుంది. లాల్‌ చౌక్‌లో జెండాను ఎగురవేసే అవకాశం మాకు లభించింది. మొదటిసారిగా మేము భారతదేశంలో ఉన్నామనే భావన కలుగుతోంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. సాహిల్​ బషీర్ భట్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ దొంగలు గతంలో ఇక్కడ వారి పతాకాన్ని ఆవిష్కరించేవారు. ఆ చరిత్రను తిరగరాస్తున్నాం అంటూ గర్వంతో వ్యాఖ్యానించారు. వందలాది పోలీసులు, పారామిలటరీ సిబ్బంది భద్రత మధ్య ఈ కార్యక్రమం జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని