Omicron: ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తుల్లోరోగ నిరోధకశక్తిపై శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

కరోనా వేరియంట్లలో అత్యంతప్రమాదకరమైంది డెల్టా వేరియంట్‌ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం డెల్టాతోపాటు ఒమిక్రాన్‌ కేసులు కూడా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఒమిక్రాన్‌ సోకినా తిరిగి కోలుకున్న వారిపై డెల్టా వేరియంట్‌ ప్రభావం పెద్దగా ఉండదని తాజాగా నిర్వహించిన

Updated : 27 Jan 2022 04:34 IST

దిల్లీ: కరోనా వేరియంట్లలో డెల్టా అత్యంతప్రమాదకరమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం డెల్టాతోపాటు ఒమిక్రాన్‌ కేసులు కూడా భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఒమిక్రాన్‌ సోకినా తిరిగి కోలుకుంటున్న వారిపై డెల్టా ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని వైద్యశాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తుల్లో తగినంత రోగనిరోధక శక్తి ప్రతిస్పందన ఉందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో తేలింది. అది డెల్టాతోపాటు ఇతర వేరియంట్లను కూడా సమర్థంగా అడ్డుకోగలదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పరిశోధనలో భాగంగా విదేశాల నుంచి వచ్చి ఒమిక్రాన్‌ బారిన పడిన కొందరిని, దేశీయ ఒమిక్రాన్‌ బాధితులు మరి కొందరిని ఎంపిక చేసి వారిలో ఇమ్యూనోగ్లోబిన్‌(ఐజీజీ), న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీ (ఎన్‌ఏజీ) ప్రతిస్పందనపై పరిశోధకులు అధ్యయనం చేశారు. కాగా.. రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్న వారిలోని న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను, ఇతర వేరియంట్లను కూడా సమర్థంగా అడ్డుకునే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, టీకాలు వేసుకోని మరికొందరిపై పరిశోధన నిర్వహించగా రోగనిరోధక ప్రతిస్పందన తక్కువగా ఉండటాన్ని గమనించారు. వ్యాక్సిన్‌ వేసుకోకపోవడం వల్లే రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. అందుకే, ప్రజలు వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేసుకోవాలని ఐసీఎంఆర్‌-ఎన్‌ఐవీ ప్రజలకు సూచిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని