IAF MiG-21: కూలిన యుద్ధ విమానం.. పైలట్‌ సురక్షితం

భారత వాయు సేనకు (IAF) చెందిన మిగ్‌-21 బైసన్‌ యుద్ధ విమానం ప్రమాదశవశాత్తూ కూలిపోయింది. రాజస్థాన్‌లోని బర్మార్‌ వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

Published : 25 Aug 2021 19:15 IST

బర్మార్ (రాజస్థాన్‌): భారత వాయు సేనకు (IAF) చెందిన మిగ్‌-21 బైసన్‌ యుద్ధ విమానం ప్రమాదశవశాత్తూ కూలిపోయింది. రాజస్థాన్‌లోని బర్మార్‌ వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సాంకేతికంగా లోపం వల్ల ఈ ఘటన జరిగిందని, పైలట్‌ సురక్షితంగా ప్రాణాలతో బయటపడినట్లు ఐఏఎఫ్‌ తెలిపింది. దీనిపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొంది. శిక్షణ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఏడాది మే నెలలో సైతం మిగ్‌-21 బైసన్‌కు చెందిన విమానమొకటి పంజాబ్‌లోని మోఘా జిల్లాలో కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌ మరణించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ ఏడాది మార్చిలో జరిగిన మరో ఘటనలో పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు