Afghanistan: అఫ్గాన్‌ పరిస్థితులపై జీ-7 కూటమి సమావేశం.. ఎప్పుడంటే?

అఫ్గాన్‌లో దిగజారుతున్న పరిస్థితులు, అక్కడి నుంచి స్థానికులతోపాటు అమెరికా తదితర దేశాల పౌరులను సురక్షితంగా తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు జీ-7 కూటమి దేశాలు ఈ నెల 24న సమావేశం కానున్నాయి. ఈ విషయాన్ని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆదివారం ట్విటర్‌ వేదికన వెల్లడించారు.

Published : 22 Aug 2021 22:21 IST

లండన్‌: అఫ్గాన్‌లో దిగజారుతున్న పరిస్థితులు, అక్కడి నుంచి స్థానికులతో పాటు అమెరికా తదితర దేశాల పౌరులను సురక్షితంగా తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు జీ-7 కూటమి దేశాలు ఈ నెల 24న సమావేశం కానున్నాయి. ఈ విషయాన్ని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆదివారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘అఫ్గానిస్థాన్‌లోని పరిస్థితులపై అత్యవసర చర్చల కోసం మంగళవారం జీ-7 నాయకుల సమావేశం జరగనుంది. కాబుల్‌ నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ సురక్షితంగా సాగేలా, స్థానికంగా ఏర్పడిన సంక్షోభాన్ని నివారించేలా, 20 ఏళ్లలో అఫ్గాన్‌ ప్రజలు సాధించిన ప్రగతిని కాపాడేలా.. అంతర్జాతీయ సమాజం కలిసి పనిచేయడం చాలా అవసరం’ అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాలిబన్ల దుశ్చర్యల కారణంగా అఫ్గాన్‌ నుంచి ఆయా దేశాలకు చెందినవారిని తరలించే ప్రక్రియ జటిలంగా మారిన విషయం తెలిసిందే. అమెరికా బలగాలు కాబుల్‌ విమానాశ్రయానికే పరిమితం కావడంతో.. ఇతర ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో సమావేశానికి పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది. జీ-7 కూటమిలో అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ దేశాలు సభ్యులుగా ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని