బీరుట్‌లో పేలుడు జరిగే సమయంలో ఇలా..

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో పేలుడు జరిగి మూడు రోజులు దాటింది. తాజాగా ఘటనా సమయంలో పేలుడు జరిగిన చోటులో పరిస్థితి.. నగరం ఎలా ఉలిక్కి పడిందనే వీడియోలో

Published : 08 Aug 2020 01:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో పేలుడు జరిగి మూడు రోజులు దాటింది. తాజాగా పేలుడుకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఘటనా సమయంలో పేలుడు జరిగిన చోటులో పరిస్థితి.. నగరం ఎలా ఉలిక్కి పడిందనే దృశ్యాలు సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్నాయి.  వీటిల్లో ఘటనా స్థలంలో.. అగ్నిమాపక సిబ్బంది పేలుడుకు కొద్ది సేపు ముందు ఎలా పోరాడుతున్నారు.. ఆ గోదాం పరిస్థితి ఏమిటో స్పష్టంగా కనిపిస్తోంది. మరో వీడియోలో ఎంతో ఉత్సాహంగా ఫొటో షూట్‌ చేస్తున్న నవవధువు త్రుటిలో ప్రమాదాన్ని ఎలా తప్పించుకుందో కళ్లకు కడుతోంది. ఇంకో వీడియోలో కళ్లముందే ఓ ఓడ పేలుడు తీవ్రతకు ఎలా బోల్తాపడిందో తెలుస్తోంది.  పేలుడు అనంతరం అక్కడ పరిస్థితి దయనీయంగా మారింది. బీరుట్‌ను ఈ పేలుడు కొన్ని దశాబ్దాల వెనక్కి తీసుకుపోయింది.














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని