Published : 23/12/2020 21:54 IST

రైతులు చర్చలకు వస్తారని ఆశిస్తున్నాం: తోమర్‌

దిల్లీ: వ్యవసాయ రంగంలో ప్రభుత్వం సంస్కరణల్ని కొనసాగిస్తుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అన్నారు. అదే విధంగా కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ముందుకు వస్తారని తాను ఆశిస్తున్నట్లు తోమర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం రైతు దినోత్సవం సందర్భంగా రైతులను ఆందోళనలు చేస్తున్న రైతులను ఉద్దేశించి మాట్లాడారు. 

‘రైతుల ఆందోళనలకు చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుంది. త్వరలోనే వారు తదుపరి రౌండు చర్చలకు వస్తారని మేం ఆశిస్తున్నాం. వారు చర్చలకు తేదీ నిర్ణయిస్తే.. ప్రభుత్వం కూడా రైతులతో సమావేశమయ్యేందుకు సిద్ధమే. చట్టాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలపై రైతులు అభిప్రాయాలు తెలపాలి. ఆ సవరణల్లో ఇంకా ఏమైనా అదనంగా చేర్చాలా లేదా తీసేయాలా అనే విషయాల్ని ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేయాలి’ అని తోమర్‌ తెలిపారు. 

‘వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత ఆరేళ్లలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టాం. ఇంకా చాలా విభాగాల్లో సంస్కరణలు చేపట్టాల్సి ఉంది. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాలకు చాలా మంది రైతులు మద్దతు పలుకుతున్నారు. కొందరు మాత్రం వీటిని వ్యతిరేకిస్తున్నారు’ అని తోమర్‌ వెల్లడించారు. కాగా వ్యవసాయ చట్టాలకు మద్దతుగా కేంద్ర వ్యవసాయ మంత్రికి 3లక్షలకు పైగా లేఖలు వచ్చాయి. అందులో 12వేల లేఖలు పంజాబ్‌ రైతుల నుంచి వచ్చాయని అధికారులు తెలిపారు. 

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులతో కేంద్రం ఇదివరకే ఐదు రౌండ్ల చర్చలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం చట్టాల్లో ఎంఎస్‌పీపై రాతపూర్వక హామీ సహా, 7 ఇతర సవరణలు ప్రతిపాదించినప్పటికీ రైతు సంఘాలు నిరాకరించడంతో చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు మూడు చట్టాల్ని వెనక్కి తీసుకునే వరకు నిరసనలు కొనసాగుతాయని రైతులు వెల్లడించారు. కేంద్రం నిర్మాణాత్మక అంశాలతో చర్చలకు ఆహ్వానిస్తేనే తాము అంగీకరిస్తామని రైతు సంఘాలు చెబుతుండటం గమనార్హం. 

ఇదీ చదవండి

బెంగాల్‌లో ఫిరాయింపుల జోరు

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని