భారీ గుమ్మడికాయ.. ప్రపంచ రికార్డు!

ప్రపంచంలో అనేక రకాల పోటీలు జరుగుతుంటాయి. కానీ, యూరప్‌లో జరిగే గుమ్మడికాయల పోటీల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఏటా అక్టోబర్‌ మాసంలో గుమ్మడికాయల్ని సాగు చేసే రైతుల మధ్య యూరోపియన్‌ పంప్‌కిన్‌ వేయింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పేరుతో పోటీ

Published : 14 Oct 2021 22:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో అనేక రకాల పోటీలు జరుగుతుంటాయి. కానీ, గుమ్మడికాయల పోటీల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? యూరప్‌లో ఏటా అక్టోబర్‌ మాసంలో గుమ్మడికాయల్ని సాగు చేసే రైతుల మధ్య యూరోపియన్‌ పంప్‌కిన్‌ వేయింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పేరుతో పోటీ నిర్వహిస్తుంటారు. యూరప్‌ వ్యాప్తంగా ఉన్న గుమ్మడికాయలు సాగు చేసే రైతులు వారు పండించిన విభిన్న రకాల గుమ్మడికాయల్ని ఈ పోటీలో ప్రదర్శిస్తుంటారు. తాజాగా జర్మనీలోని లుడ్విగ్స్‌బర్గ్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో ఇటలీలోని టస్కానీ ప్రాంతానికి చెందిన ఓ రైతు పండించిన టన్నుకుపైగా బరువున్న గుమ్మడికాయ విజేతగా నిలిచింది. దాని బరువు సరిగ్గా 1,217.5కిలోలు. అందుకే ప్రపంచంలోనే అత్యధిక బరువున్న గుమ్మడికాయగానూ రికార్డు సృష్టించింది. అమెరికాలోనూ ఇలాంటి పోటీలనే నిర్వహిస్తుంటారు. ఇటీవల జరిగిన ఈ పోటీలో వాషింగ్టన్‌కు చెందిన జెఫ్‌ పండించిన 994 కిలోల గుమ్మడికాయకు రూ.15లక్షల ప్రైజ్‌ మనీ దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని