మెక్సికోలో కాల్పులు.. 13 మంది మృతి

మెక్సికో నగరంలో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. ఓ క్రిమినల్‌ గ్యాంగ్ పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో 13 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు....

Updated : 19 Mar 2021 15:40 IST

మెక్సికో: మెక్సికో నగరంలో ఓ క్రిమినల్‌ గ్యాంగ్ పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో 13 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. సెంట్రల్‌ మెక్సికోలో గురువారం రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసు వాహన శ్రేణి లక్ష్యంగా ఓ మాదకద్రవ్యాల ముఠా ఒక్కసారిగా కాల్పులకు పాల్పడింది. ఈ దాడిలో 8 మంది పోలీసులు, ఐదుగురు ప్రాసిక్యూషన్‌ ఇన్వెస్టిగేటర్లు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రజా భద్రతా విభాగాధిపతి రోడ్రిగో మార్ట్నెజ్ సెలిస్ మాట్లాడుతూ.. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు. సైనికులు, నేషనల్ గార్డ్ దళాలు మెక్సికో నగరవ్యాప్తంగా విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. నిందితులకు తగిన గుణపాఠం చెబుతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని