Updated : 01/12/2021 04:03 IST

Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పుల మోత

అమెరికా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మిచిగాన్‌ రాష్ట్రంలోని డెట్రాయిట్‌ నగరానికి  సమీపంలో ఉన్న ఓ పాఠశాలలో దుండగుడు కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. మరో ఆరుగురు గాయాలపాలైనట్లు చెబుతున్నారు. వీరిలో ఒక టీచరు ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న పోలీసుల బలగాలు వెంటనే ఆ పాఠశాలను చుట్టుముట్టాయి. అనంతరం 15 ఏళ్ల అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి హ్యాండ్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు 15-20 రౌండ్లు కాల్చినట్లు పోలీసులు చెప్పారు. 
 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్