ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంటే చర్చలకు సిద్ధమే

నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం ప్రతిపాదనపై రైతులు స్పందించిన తర్వాతే చర్చలు తిరిగి ప్రారంభిస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారు.

Updated : 25 Feb 2021 13:37 IST

రైతులతో చర్చలపై స్పందించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం ప్రతిపాదనపై రైతులు స్పందించిన తర్వాతే చర్చలు తిరిగి ప్రారంభిస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకానికి రెండేళ్లు పూర్తైన సందర్భంగా బుధవారం ఓ సమావేశం ఏర్పాటు చేశారు.  తర్వాత తోమర్‌ పాత్రికేయులతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. సుప్రీంకోర్టు సూచన మేరకు 18నెలల పాటు వ్యవసాయ చట్టాల అమలును ఆపేస్తామన్న తమ ప్రతిపాదనకు రైతులు స్పందించిన తర్వాతే చర్చలు తిరిగి ప్రారంభిస్తామని తోమర్‌ అన్నారు. జనవరి 22 వరకు రైతు సంఘాలు, కేంద్రానికి మధ్య 11 రౌండ్ల చర్చలు జరిగాయి.

నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకుంటే 40లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేశ్‌ టికాయిత్‌  హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తోమర్‌ స్పందిస్తూ.. ‘‘ రైతులతో చర్చల్ని కేంద్రం సానుభూతితో పరిశీలిస్తోంది. మా ప్రతిపాదనపై రైతులు తమ స్పందన తెలియజేసిన వెంటనే మేం చర్చలకు ఆహ్వానిస్తాం.’’ అని అన్నారు. పదో విడత చర్చల్లో భాగంగా నూతన వ్యవసాయ చట్టాలను సంవత్సరంన్నర పాటు నిలిపేస్తామన్న కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. తమ హక్కులైన కనీస మద్దతు ధర, మండీలను తొలగించేందుకే ప్రభుత్వం ఈ చట్టాలను తెచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని