Corona Virus: అమ్మకానికి భారతీయుల కొవిడ్‌-19 డేటా!

భారత్‌లోని వేలాది మంది పౌరులకు సంబంధించిన వ్యక్తిగత, కొవిడ్‌ డేటా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారని, ఇందులో వ్యక్తుల పేర్లు, మొబైల్‌ నంబర్లు, చిరునామాలు, కొవిడ్‌ పరీక్ష నివేదిక వివరాలు ఉన్నాయంటూ

Updated : 22 Jan 2022 08:29 IST

ఖండించిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: భారత్‌లోని వేలాది మంది పౌరులకు సంబంధించిన వ్యక్తిగత, కొవిడ్‌ డేటా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారని, ఇందులో వ్యక్తుల పేర్లు, మొబైల్‌ నంబర్లు, చిరునామాలు, కొవిడ్‌ పరీక్ష నివేదిక వివరాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. ‘‘కొవిన్‌ వెబ్‌సైట్‌ నుంచి డేటా బహిర్గతమైందంటూ వచ్చిన వార్తలను పరిశీలిస్తున్నాం. మేం లబ్ధిదారుల చిరునామా, వారి కొవిడ్‌ పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని సేకరించం. కాబట్టి ఆ డేటా కొవిన్‌ నుంచి వెల్లడి కాలేదని అర్థమవుతోంది’’ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. 20 వేల మందికి పైగా వ్యక్తుల డేటా ‘రైడ్‌ ఫోరమ్స్‌’ వెబ్‌సైటులో  సైబర్‌ నిందితుడు అమ్మకానికి పెట్టాడని వార్తా కథనాలొచ్చాయి. దీనిపై సైబర్‌ భద్రత నిపుణుడు రాజశేఖర్‌ రాజాహరియా ట్వీట్‌ చేశారు. వ్యక్తుల పేర్లు, మొబైల్‌ నంబర్లు,  ఆర్టీ-పీసీఆర్‌ ఫలితాలతో ఉన్న జాబితాలను ‘డార్క్‌వెబ్‌’లో అమ్మకానికి పెట్టినట్లు రాజాహరియా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని