ఇలా ప్రధాని పగ్గాలు.. అలా రాజీనామా!

ఐరోపా దేశమైన స్వీడన్‌లో బుధవారం  దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళకు ప్రధాని పగ్గాలు అప్పగించడం.. కొద్ది గంటల్లోనే ఆమె రాజీనామా చేయడం వంటి పరిణామాలు చకచకా చోటుచేసుకున్నాయి.

Updated : 25 Nov 2021 08:42 IST

 స్వీడన్‌లో రాజకీయ వైచిత్రి

మగ్దలీనా

కోపెన్‌హాగన్‌: ఐరోపా దేశమైన స్వీడన్‌లో బుధవారం దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళకు ప్రధాని పగ్గాలు అప్పగించడం.. కొద్ది గంటల్లోనే ఆమె రాజీనామా చేయడం వంటి పరిణామాలు చకచకా చోటుచేసుకున్నాయి. మగ్దలీనా అండర్సన్‌ (54)కు దేశ పాలన పగ్గాలను అప్పగిస్తూ పార్లమెంటు ఆమోదం తెలిపింది. దేశ ఆర్థిక మంత్రి, సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ నేతగా ఇటీవల ఎన్నికైన అండర్సన్‌ అరుదైన ఘనతను దక్కించుకున్నారంటూ అంతర్జాతీయంగా ప్రశంసలు కూడా అందుకున్నారు. కొద్ది గంటల్లోనే పార్లమెంటులో ఓ బడ్జెట్‌ ఓడిపోవడం, రెండు పార్టీలతో కూడిన మైనారిటీ ప్రభుత్వం నుంచి ఓ సంకీర్ణ భాగస్వామి వైదొలగడంతో ఆమె రాజీనామా చేశారు. ‘‘ఈ బాధ్యత గౌరవప్రదమే అయినా.. ఉనికి ప్రశ్నార్థకమయ్యే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించాలని నేను కోరుకోవడం లేదు’’ అని ఆమె చెప్పారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని