Youtube: యూట్యూబ్‌ చూసి హెలికాప్టర్‌ తయారు చేశాడు.. కానీ..

కేవలం ఎనిమిదో తరగతి వరకే చదివిన యువకుడు సొంతంగా హెలికాప్టర్‌ తయారుచేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే అదే హెలికాప్టర్‌ తన ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయాడు. మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా మహాగావ్‌ తాలూకా

Updated : 13 Aug 2021 08:29 IST

ప్రయోగ పరీక్ష చేస్తూ మృతి

కేవలం ఎనిమిదో తరగతి వరకే చదివిన యువకుడు సొంతంగా హెలికాప్టర్‌ తయారుచేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే అదే హెలికాప్టర్‌ తన ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయాడు. మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా మహాగావ్‌ తాలూకా ఫుల్సవంగికి చెందిన షేక్‌ ఇబ్రహీం(24) తన సోదరుడి గ్యాస్‌ వెల్డింగ్‌ వర్క్‌షాప్‌లో పనిచేస్తూ, అందులో ప్రావీణ్యం సాధించాడు. గత రెండేళ్లుగా యూట్యూబ్‌ చూస్తూ, కావాల్సిన పరికరాలు సమకూర్చుకుంటూ ఓ హెలికాప్టర్‌ను తయారుచేశాడు. బుధవారం వేకువజామున దాని ట్రయల్‌ రన్‌ ప్రారంభించాడు. ఇంజిన్‌ స్టార్ట్‌ చేయగానే రోటర్‌ బ్లేడ్‌ విరిగి రెక్క ఊడిపోయింది. అది క్యాబిన్‌ లోపల ఉన్న ఇస్మాయిల్‌కు తగలడంతో గొంతు తెగి అక్కడికక్కడే మృతిచెందాడు. ‘‘తన ఊరు, ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని కలలు కన్న ఇస్మాయిల్‌ అది నెరవేరకుండానే మరణించాడు’’ అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.


డ్రైవర్‌ లేని విద్యుత్తు కారు

పుణే విద్యార్థుల ఘనత

పుణెలోని ఎంఐటీ కళాశాల విద్యార్థులు.. దేశంలో మొదటిసారిగా డ్రైవర్‌ లేకుండా నడిచే విద్యుత్తు కారు తయారుచేశారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న కేస్కర్‌, సుధాంశు మణెరికర్‌, సౌరభ్‌ దమాక్లే, శుభంగ్‌ కులకర్ణి, ప్రత్యక్ష పాండే, ప్రేరణ కొలిపాక ఈ ఘనత సాధించారు. కృత్రిమ మేథతో పనిచేసే ఈ కారుతో.. మానవ తప్పిదాలతో జరిగే ప్రమాదాలన్నీ నివారించవచ్చన్నారు. మూడు కిలోవాట్ల సామర్థ్యమున్న లిథియం ఐరన్‌ బ్యాటరీని ఇందులో వాడామని, 4 గంటలు ఛార్జ్‌ చేస్తే దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు