Corona: వారిలో రీఇన్‌ఫెక్షన్‌ ముప్పు తక్కువే

కరోనా కారణంగా ఒకసారి తీవ్రంగా అనారోగ్యం పాలైనవారికి రెండోసారి వైరస్‌ సోకే ముప్పు చాలా తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనమొకటి తేల్చింది.

Updated : 17 Jun 2021 08:21 IST

కొలంబియా: కరోనా కారణంగా ఒకసారి తీవ్రంగా అనారోగ్యం పాలైనవారికి రెండోసారి వైరస్‌ సోకే ముప్పు చాలా తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. 1% కంటే తక్కువ కేసుల్లోనే రీఇన్‌ఫెక్షన్‌ కనిపిస్తోందని నిర్ధారించింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మసోరీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు.. కొవిడ్‌ దెబ్బకు తీవ్రంగా జబ్బుపడిన 9,119 మంది డేటాను సేకరించి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వారిలో 63 మంది (0.7%) మాత్రమే రెండోసారి కరోనా బారిన పడ్డారు. రెండుసార్లు పాజిటివ్‌గా తేలడానికి మధ్య కాలం సగటున 116 రోజులుగా నమోదైంది. రీఇన్‌ఫెక్షన్‌ బాధితుల్లో ఇద్దరు మాత్రమే (3.2%) మృత్యువాతపడ్డారు. తొలిసారి పాజిటివ్‌ వచ్చినప్పటితో పోలిస్తే.. రెండోసారి వైరస్‌ సోకినవారిలో న్యుమోనియా, గుండె వైఫల్యం, మూత్రపిండ సంబంధిత వ్యాధుల వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని