Corona: కొంపముంచిన ‘కొవిడ్‌’ ఉత్తీర్ణత!

పంజాబ్‌లోని గురునానక్‌ దేవ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఇటీవల పట్టభద్రులైన దాదాపు 300 మంది విద్యార్థులు ‘కరోనా చదువుల’ విపరిణామాలను ఎదుర్కొంటున్నారు. వీరికి ఉద్యోగాలు ఇచ్చేందుకు గతంలో ముందుకువచ్చిన పలు కంపెనీలు ఇపుడు విద్యార్థుల ప్రతిభ,

Published : 14 Jun 2021 07:07 IST

300 మంది విద్యార్థుల భవిత అగమ్యగోచరం

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని గురునానక్‌ దేవ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఇటీవల పట్టభద్రులైన దాదాపు 300 మంది విద్యార్థులు ‘కరోనా చదువుల’ విపరిణామాలను ఎదుర్కొంటున్నారు. వీరికి ఉద్యోగాలు ఇచ్చేందుకు గతంలో ముందుకువచ్చిన పలు కంపెనీలు ఇపుడు విద్యార్థుల ప్రతిభ, సామర్థ్యాలకు తగ్గ అకడమిక్‌ రుజువుల్లేవంటూ వెనకడుగు వేస్తున్నాయి. ఈ పరిస్థితులపై ఆదివారం విశ్వవిద్యాలయ అధికారులు స్వయంగా ఓ ప్రకటన చేస్తూ విద్యార్థులు విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితుల కారణంగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించిన అధ్యాపకులు షెడ్యూలు ప్రకారం పక్కాగా అన్ని సెమిస్టర్లను నిర్వహించలేకపోయారు. కొన్ని పరీక్షలు ఈ మెయిళ్ల ద్వారా కూడా జరిగాయి. అంతకుముందు జరిగిన సెమిస్టర్ల సగటు మార్కుల ఆధారంగా గతేడాది విద్యార్థులను పై తరగతికి పంపారు. ఈ విధానం వల్ల కొందరు బాగా చదివే విద్యార్థులు నష్టపోయారు. మొత్తానికి అన్ని సెమిస్టర్ల మార్కుల కార్డులు అందుబాటులో లేవు. తీరా ఇప్పుడు విద్యార్థుల ఉద్యోగ నియామకాలకు వచ్చేసరికి కొన్ని కంపెనీలు అన్ని సెమిస్టర్ల మార్కుల కార్డులు చూపాలని పట్టుబడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని