Omicron: ఒమిక్రాన్‌ ప్రభావం స్వల్పమే : ఐఐటీ-కాన్పుర్‌ ప్రొఫెసర్‌

కరోనా మూడో దశ ‘ఒమిక్రాన్‌’ ప్రభావం స్వల్పంగానే ఉండనుంది. జనవరి-ఫిబ్రవరి నెలల్లో అది గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది.

Published : 06 Dec 2021 10:12 IST

దిల్లీ: కరోనా మూడో దశ ‘ఒమిక్రాన్‌’ ప్రభావం స్వల్పంగానే ఉండనుంది. జనవరి-ఫిబ్రవరి నెలల్లో అది గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. గణిత శాస్త్రం ప్రకారం ఐఐటీ-కాన్పుర్‌కు చెందిన ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. ప్రభుత్వం ఆమోదించిన ‘సూత్ర’ అనే విధానం ఆధారంగా ఆయన ఈ అధ్యయనం చేశారు. ఆ సమయంలోనే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరగనుండడం గమనార్హం. ఒమిక్రాన్‌కు భయపడాల్సిందేమీ లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఫ్రొపెసర్‌ అగర్వాల్‌ భరోసా ఇస్తున్నారు. శరీరంలో సహజంగా ఉండే రోగ నిరోధశక్తిని ఇది హరించబోదని ఆయన తెలిపారు. ఒకవేళ సోకినా క్లిష్ట సమస్యలు తీసుకురాదని, స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని చెప్పారు. గరిష్ఠ స్థాయికి చేరిన సందర్భంలో కూడా దాని ప్రభావం తక్కువగా ఉంటుందని అన్నారు. మూడో దశ రావడం ఖాయమని, ప్రభుత్వం తీసుకునే చర్యలపైనే దీని ప్రభావం ఆధారపడి ఉంటుందని తెలిపారు. రాత్రి వేళ కర్ఫ్యూలు, గుంపులుగా చేరడంపై నిషేధం వంటి చర్యలు సరిపోతాయని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని