CBSE: ‘సీబీఎస్‌ఈ పరీక్షల్ని ఆన్‌లైన్‌లోనూ నిర్వహించాలి’

ఒమిక్రాన్‌ కేసులు వివిధ దేశాల్లో వెలుగు చూస్తున్న తరుణంలో సీబీఎస్‌ఈ పరీక్షల్ని ఆఫ్‌లైన్‌లో మాత్రమే కాకుండా

Updated : 02 Dec 2021 10:50 IST

కేంద్రమంత్రికి విద్యార్థుల తల్లిదండ్రుల లేఖ

దిల్లీ: ఒమిక్రాన్‌ కేసులు వివిధ దేశాల్లో వెలుగు చూస్తున్న తరుణంలో సీబీఎస్‌ఈ పరీక్షల్ని ఆఫ్‌లైన్‌లో మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లోనూ నిర్వహించేలా బోర్డుకు ఆదేశాలివ్వాలని దాదాపు 8,000 మంది విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వారు లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ విధానాన్ని ఎత్తివేయడం విపత్తుకు దారి తీయవచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఇప్పటివరకు విద్యార్థులకు వ్యాక్సిన్లు ఇవ్వలేదు. తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని నిర్ణయించి, అదే సూత్రాన్ని పరీక్షలకు వర్తింపజేయకపోవడం ఏకపక్షంగా ఉంది. ఇది కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధం’ అని లేఖలో తెలిపార 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు